ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

ASF: ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన తారాబాయి (42) ఆదివారం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా స్కూటిపై వస్తున్న వ్యక్తి ఆమెను ఢీ కొట్టాడు. దాంతో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అంబులెన్స్ ద్వారా హుటాహుటిన వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.