VIDEO: తిమ్మప్ప జాతర రంగరాట్నంపై వీడియో
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి రంగురాట్నంపై జాతర పూర్తి వీడియోను చిత్రీకరించినట్లు స్థానికులు తెలిపారు. జాతర సందర్భంగా ఎటు చూసినా ప్రజలతో కిక్కిరిసిపోయి, అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంత రద్దీ కనిపించింది.