VIDEO: ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: అడవిదేవులపల్లి మండలంలోని దున్నపోతుల గండి ప్రాజెక్టు పనులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్ట్ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయాలని, వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు పనులను ఆలస్య చేయకుండా పూర్తి చేసి రైతులకు అందించాలని అధికారులకు సూచించారు.