కాణిపాకం ఆలయానికి టీటీడీ ఆర్థికసాయం
AP: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి టీటీడీ ఆర్థికసాయం ప్రకటించింది. ఈ మేరకు అనుమతిస్తూ ఈవోకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయానికి టీటీడీ రూ.25 కోట్లు అందించింది. యాత్రికుల సౌకర్యాల కోసం భవన సముదాయం నిర్మాణానికి, కాణిపాకంలో సామూహిక వివాహాల కోసం పెద్ద హాళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించారు.