VIDEO: పుల్లూరులో మొసలి కలకలం

VIDEO: పుల్లూరులో మొసలి కలకలం

GDWL: ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామంలోని తుంగభద్ర నది ఒడ్డున ఆదివారం మొసలి కనిపించడంతో కలకలం రేగింది. పొలం పనులకు వెళ్లిన రైతులు నది ఒడ్డున ఉన్న ఒక బండపై మొసలిని గుర్తించి తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.