ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ పరీక్షలు

ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ పరీక్షలు

JEE మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 2, 4వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. రెండు షిప్టుల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిప్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష జరగనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.