30 ఏళ్ల ఇళ్లకు భయం లేదు: హైడ్రా కమిషనర్

30 ఏళ్ల ఇళ్లకు భయం లేదు: హైడ్రా కమిషనర్

MDCL: బోడుప్పల్లోని సుద్దకుంట చెరువు పరిసరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు ఇళ్లపై నెంబర్లు వేసి భయాందోళనలకు గురిచేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పాతనోటిఫికేషన్ ప్రకారమే హద్దులు ఉంటాయని, 30 ఏళ్లుగా ఉన్న ఇళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోమని ఆయన హామీ ఇచ్చారు.