సనత్‌నగర్‌లో చున్నీ చిక్కుకుని యువతి మృతి
MDCL: సనత్‌నగర్ పరిధిలోని పేపర్ గ్లాస్ తయారీ కర్మాగారంలో విషాదం చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన సోనిబాయి బాలానగర్ పారిశ్రామికవాడలోని కంపెనీలో పనిచేస్తుంది. శనివారం పని సమయంలో యంత్రం రోల్లో ఆమె చున్నీ ఇరుక్కుంది. చున్నీ మెడకు చిక్కుకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.