వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయం: పువ్వాళ్ళ

KMM: దివంగత మాజీ సీఎం YSR ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని DCC అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. YSR వర్థంతి సందర్భంగా మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయన పేదల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.