కొండెవరం గ్రామంలో మంచినీటి పునరుద్దరణ

KKD: కొత్తపల్లి మండలం కొండెవరం పంచాయతీ పరిధిలో నీటి సరఫరా పైప్‌లైన్ పగిలిపోవడంతో గత ఐదు రోజులుగా మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజల ఇబ్బందులను గమనించిన అధికారులు, గ్రామ సర్పంచ్ వేమగిరి చెలయ్యమ్మ రాంబాబు, గ్రామ సెక్రటరీ చొరవతో ఇంటింటికీ మంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.