టిడ్కో కాలనీలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు

టిడ్కో కాలనీలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో చెత్తను రోడ్డుమీద వేయడం వల్ల కుక్కలు, పందులు వాటిని రోడ్డుమీదకు లాగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే రాము దృష్టికి చేరింది. ఈ సమస్యపై ఎమ్మెల్యే స్పందించి కాలనీలో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి శుభ్రతపై సోమవారం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.