ఆర్టెమిస్-2.. కట్ కానున్న సంబంధాలు!
నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్.. చందమామ దిశగా ప్రయాణాన్ని సాగిస్తోంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్ వ్యోమనౌక.. జాబిల్లి వెనుక భాగానికి వెళ్లి, తర్వాత భూమి దిశగా దూసుకొస్తుంది. అయితే, చంద్రుడి వెనుక భాగానికి వెళ్లిన సమయంలో వ్యోమనౌకకు.. హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సంబంధాలు నిలిచిపోనున్నట్లు నాసా వెల్లడించింది.