ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. సత్తుపల్లి ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కాగా ఈ వైద్య శిబిరంలో చికిత్స చేసుకున్న వారికి ఎమ్మెల్యే ఉచితంగా మందులను అందజేశారు.