ఈనెల 24న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు
ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అండర్-14, 17 బాల, బాలికల క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఈనెల 24న పెదవేగి మండలం వంగూరు ANM క్రికెట్ అకాడమీలో జరుగుతాయని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, క్రీడా దుస్తులు, బ్యాట్, బాల్, ప్యాడ్‌లతో హాజరుకావాలని సూచించారు.