'యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది'
JGL: ప్రతిరోజు యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం యోగ ప్రదర్శన, ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జీవన శైలిలో యోగ ఒక భాగంగా అలవార్చుకోవాలని ఆరోగ్య సంరక్షణకు యోగ ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్రక్రమంలో డీఎంహెచ్ఐ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్ఐ పాల్గొన్నారు.