రాష్ట్రకూటుల కాలం నాటి రాతి గణపతి ఎక్కడంటే..?

SDPT: వినాయక చవితి వేళ రాయపోల్‌లో ఈ పురాతన కాలం నాటి రాతి గణపతి గురించి తెలుసుకొవాల్సిందే. ఈ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తొంది. ఐదడుగులకు పైగా ఎత్తుతో బంగారు వర్ణంలో కనిపించే ఈ విగ్రహం క్రీ.శ 1048 కాలం నాటిది. గావుండ హువిన అనే రాజు కొడుకు జువ్విరెడ్డి ఈ విగ్రహ ప్రతిష్ట చేసినట్లు స్థానికులు అంటూన్నారు. రాష్ట్ర కూటుల నాటిది అయి ఉంటుందని చరిత్ర పరిశోధకులు వెల్లడించారు.