'స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలి'
AKP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం కోటవురట్లలో టీడీపీ నాయకులు జానకి శ్రీను, పీవీ సూర్యారావుతో కలిసి మాట్లాడుతూ యువత, మహిళలు, రైతాంగానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి మద్దతు పలకాలని కోరారు.