రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: ఎస్సై
KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఎస్సై ఎన్సీ మల్లికార్జున రోడ్డు నియమాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మితిమీరిన వేగంతో, పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడిపవద్దని డ్రైవర్లకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే విడిచిపెట్టేది లేదని డ్రైవర్లకు హెచ్చరించారు.