ఈవీఎం గోదాము వద్ద పటిష్ఠ బందోబస్తు
ASF: జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లోని ఈవీఎం గోదామును గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. గోదాము వద్ద పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు.