87వ వార్డులో క్రికెట్ పోటీలు ప్రారంభం
VSP: విశాఖలోని 87వ వార్డు కణితిలో కళింగ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షుడు బొడ్డ గోవింద్, కార్పొరేటర్ బి.జగన్నాదం ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఉత్సాహాన్ని పెంచుతాయని గోవింద్ అన్నారు.