పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా ఉంచాలని సిబ్బందికి తెలియజేశారు. ఈ తనిఖీలో భాగంగా ఎస్పీ వెంట డీఎస్పీ రాఘవులు, సీఐ శంకర్ రావు, పోలీస్ సిబ్బంది, పలు అధికారులు పాల్గొన్నారు.