కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

కృష్ణా: నందివాడ మండలం ఇలపర్రు శివారు లక్ష్మీనరసింహాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఇలపర్రు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆదివారం పంపిణీ చేశారు. ఈ వేకువ జామునే పనులు చేసుకోవాలని ఏఎన్ఎంసీహెచ్ కరుణ కూలీలకు సూచించారు. ఎండ వేడిమి పడకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.