'రైతు సంక్షేమ పథకాలపై అవగాహన పెంచాలి'
అన్నమయ్య: మదనపల్లి(మం) అంకిశెట్టిపల్లిలో నిర్వహించిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ పాల్గొని రైతులతో ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతుల భూ, ఈ-క్రాప్, రుణ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధనే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.