వాహనదారులు ఇవి పాటించాలి: ఎస్పీ

వాహనదారులు ఇవి పాటించాలి: ఎస్పీ

చలికాలం పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని నిద్రలేమి, తాగిన మత్తులో డ్రైవింగ్ చేయొద్దన్నారు. ఉదయం వేళ వాకింగ్ వెళ్లేవారు జాతీయ రహదారులపై కాకుండా నిర్ణీత మైదానాల్లో మాత్రమే వ్యాయామం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని ఎస్పీ కోరారు.