ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు

KMM: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని కూసుమంచి ఏడీఏ సతీష్ హెచ్చరించారు. కూసుమంచిలోని రైతు వేదికలో ఎరువుల డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల అవసరాల మేరకు యూరియా, ఇతర ఎరువులను అందించాలని, చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎరువుల స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.