నల్గొండ జిల్లాలో అనుమతి లేని పాఠశాలలు ఇవే..!

NLG: జిల్లాలో మూడు పాఠశాలలకు అనుమతి లేదని జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తెలిపారు. నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్‌లో గల జయ హైస్కూల్, హాలియాలోని శ్రీ చైతన్య హైస్కూల్, దేవరకొండ పట్టణంలోని శ్రీ చైతన్య హైస్కూల్లకు అనుమతి లేదని తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని వెల్లడించారు.