విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ (75*) విధ్వంసం సృష్టించాడు. మొయిన్ అలీ బౌలింగ్ చేసిన 12వ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. అలాగే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసిన 13.1వ ఓవర్లో పరాగ్ మరో సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు వరుసగా ఎదుర్కొన్న 6 బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు.