రాష్ట్రాన్ని జగన్ అధోగతి పాలు చేశారు: ఎమ్మెల్యే
KDP: మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. బుధవారం పొద్దుటూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు.