BREAKING: పాకిస్తాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక

BREAKING: పాకిస్తాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక

పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతుందన్న వార్తలు వస్తున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై దాడికి యత్నించే వారికి సరైన జవాబు ఇస్తామని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ పనితనం, పట్టుదల గురించి ప్రజలకు తెలుసన్నారు. చైనాతో కలిసి కుట్రలు చేసే వారికి గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దేశ సరిహద్దులు, సైనిక భద్రత తన బాధ్యత అని చెప్పారు.