'అందరికీ నష్టపరిహారం చెల్లిస్తాం'
TPT: కేవీబీపురం మండలంలో పెద్ద రాయలచెరువు గండి కారణంగా ముంపునకు గురైన కళత్తూరు పాతపాలెం ఎస్ఎల్ పురం గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. కొందరికి నష్టపరిహారం చెల్లించారు. ఆయన మాట్లాడుతూ.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మూగజీవాలకు, పంట నష్టానికి, ఇతర నష్టాలకు సంబంధించి ప్రతి బాధితునికి నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.