అద్వాన్నంగా మారిన మడికి-దుళ్ల రోడ్డు
కోనసీమ: కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా బాగున్న రోడ్డుకే వాహనాల భారం పడుతుంది. అలా వాహనాల భారం పడి ఆలమూరు మండలం మడికి, కడియం మండలం దుళ్ల కాలువ గట్టు R&B రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డు సగానికి మొక్కలైపోయి మోకాళ్ళ లోతుకు జారిపోయింది. ఈ రోడ్డుకు పూర్తిస్థాయిలో మరమత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.