జనసేనలో నూతన చేరికలు

నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ జనసేన నగర పార్టీ కార్యాలయంలో బుధవారం తేజా, వారి మిత్ర బృందం జనసేనలో చేరారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ఇష్టంతో తేజా, వారి మిత్రులు పార్టీలో చేరడం సంతోషదాయకమని తెలిపారు.