‘పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలి’
PDPL: మంథని పట్టణ కేంద్రంలోని ఆర్టీసీబస్ స్టేషన్‌లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలు, అలాగే గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని ఏఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృషి సారించాలని, పిల్లలు చేసే ప్రతి చర్యను గమనించాలని సూచించారు. అదే విధంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.