నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది జాబితాను హైకమాండ్‌కు పంపారు. దీనిపై AICC చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉంది.