హోంగార్డు కుటుంబానికి పోలీసు సిబ్బంది చేయూత

హోంగార్డు కుటుంబానికి పోలీసు సిబ్బంది చేయూత

MDK: మెదక్ రూరల్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించిన మహేందర్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది అందరూ కలిసి రూ.3 లక్షల జమ చేసి బుధవారం మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.