శబరిమలైలో వైసీపీ నాయకుల బ్యానర్ ప్రదర్శన
NLR: కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్పస్వామి వారి సన్నిధిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ బండ్లపాలెం గ్రామ వైసీపీ నాయకులు కొండమీద ప్రదర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి కావాలని యాత్ర చేశామన్నారు.