నేడు కామేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
KMM: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కామేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్లు హారిక, రంజిత్ తెలిపారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలుచేసి అవసరమైన మందులను పంపిణీ చేస్తామన్నారు. నిపుణులైన వైద్యులతో ఆరోగ్య సలహాలు సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.