బాపట్ల ఫొటో గ్రాఫర్‌కు అంతర్జాతీయ అవార్డు
BPT: బాపట్ల ఫొటోగ్రాఫర్ నాగరాజుకు అంతర్జాతీయ అవార్డు వరించింది. KATV ఫొటోగ్రఫీ వరల్డ్ కలకత్తా వారు ఆన్‌లైన్‌లో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. వర్షంలో తాబేలుతో ఆడుకుంటున్న చిన్నారి చిత్రాన్ని ఆయన పోటీల్లో ప్రవేశపెట్టగా ప్రథమ బహుమతి లభించిందని సంస్థ వ్యవస్థాపకురాలు సుజాత మండల్ గురువారం ప్రకటించారు.