ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
పల్నాడు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. అచ్చంపేట మండలం ఓర్వకల్లుకు చెందిన ప్రియుడు విజయ్, ప్రియురాలు వెంకటలక్ష్మీ ఒకే గదిలో పురుగుమందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వెంకటలక్ష్మీ ప్రాణాలు కోల్పోయింది. విజయ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.