కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి
ELR: నూజివీడు మండలం సుంకొల్లు గ్రామ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై సోమవారం దాడులు నిర్వహించినట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ దాడులలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, ఒక పుంజు, 7600 రూపాయల నగదు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.