మోదీ మీటింగ్.. ఐదుగురు సీఎంలు గైర్హాజరు!
దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో కాసేపట్లో వర్చువల్‌గా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. యుద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, దేశంపై ప్రభావాన్ని సీఎంలకు ప్రధాని వివరించనున్నారు. అయితే, ఈ భేటీకి ఐదుగురు సీఎంలు గైర్హాజరు కానున్నట్లు సమాచారం. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి సీఎంలు హాజరు కాలేమని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.