ఎమ్మెల్సీ రవిబాబును కలిసిన ఎస్టీ విభాగం అధ్యక్షులు

వైసీపీ శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబును పలాస నియోజకవర్గ వైసీపీ ఎస్టీ విభాగం అధ్యక్షులు సవర నీలకంఠం విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో ఉన్న గిరిజన సమస్యలపై చర్చించారు.