బచ్చన్నపేటలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
JNG: బచ్చన్నపేట మండల కేంద్రంలో బుధవారం ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం మండల ఇంఛార్జ్ బండ కింది హరిబాబు, మాజీ ఎంపీటీసీ ఎండీ మసూద్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.