బీఎస్ఎఫ్ జవాన్‌ను సన్మానించిన మాజీ కార్పొరేటర్

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన కట్ట హరిబాబు బీఎస్ఎఫ్‌లో సుదీర్ఘ కాలంగా పని చేసి రిటైర్మెంట్‌పై మంగళవారం మడికొండ గ్రామానికి చేరుకోగా ఆయనను మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్ ఘనంగా సన్మానించారు. అనంతరం హరిబాబు దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోహన్, నర్సయ్య, చంటి పాల్గొన్నారు.