బావిలో మహిళా మృతదేహం లభ్యం..!

బావిలో మహిళా మృతదేహం లభ్యం..!

VKB: పరిగిలోని నస్కల్లో గల ఒక బావిలో మహిళా మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని బర్కత్‌పల్లికి చెందిన మానెమ్మగా గ్రామస్థులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పరిగి సీఐ తెలిపారు.