లెబనాన్‌లో.. నేడు జాతీయ సంతాప దినం!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 250 మంది పౌరులు మరణించడంతో లెబనాన్ నేడు జాతీయ సంతాప దినం ప్రకటించింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించడంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగాయి.