రోడ్ల పైనే నిర్మాణ వ్యర్ధాల డంపింగ్

రోడ్ల పైనే నిర్మాణ వ్యర్ధాల డంపింగ్

MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన మార్గంలో కావేరి నగర్ కల్వర్టు వద్ద రోడ్ల పైనే నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలను తొలగించి, ఇలాంటి అక్రమ డంపింగ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.