విశేషంగా ఆకట్టుకున్న గీతా పారాయణం
RR: గచ్చిబౌలి జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాతృమండలి గీతావాహిని బృందం పాల్గొని గీత పారాయణం చేశారు.గీతా శ్లోకాలతో ప్రాంగణం భక్తి మయంగా మారింది.గీతా వాహిని బృందం సమూహంగా పారాయణం చేయడం అందరిని ఆకట్టుకుంది. గీతా బోధనలు జీవితంలో పాటించాలని సభ్యులు కోరారు.