వేసవి దృష్ట్యా రైతులు జాగ్రత్తలు పాటించాలి

SRPT: వేసవి దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ఎస్సై నరేష్ సూచించారు. బుధవారం గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, ఇతర పరికరాలను ఇంటి వద్ద భద్రపరుచుకోవాలని సూచించారు. వరికొయ్యలకు నిప్పు పెడితే అగ్నిప్రమాదాలు జరుగుతాయన్నారు.