టొబాకో సమస్యలపై అధికారులతో ఎంపీ ప్రత్యేక సమావేశం
E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన శుక్రవారం టొబాకో బోర్డు అధికారులు, టొబాకో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరల స్థిరీకరణ, మార్కెటింగ్ విధానాలు, వేలం కేంద్రాల్లో వచ్చే ఇబ్బందులు, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై చర్చించారు. ఆయా విషయాలపై ఎంపీ సానుకూలంగా స్పందించారు.